
-నస్రీన్ ఖాన్
అత్యాచార భారత్
కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం` అన్నాడో కవి. ఇప్పుడు `కన్ను తెరిస్తే కిడ్నాప్. కన్ను మూస్తే అత్యాచారం.`అని మార్చుకోవాలేమో. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఒక పసికూనపైనో, ఒక కిశోర బాలికపైనో, ఒక మహిళపైనో, చివరాఖరుకు ఒక వృద్ధురాలిపైనో అత్యాచారం జరుగుతూనే ఉండి ఉండవచ్చు. ఇవి నోటికి వచ్చినట్లు చెబుతున్న మాటలు కావు. జాతీయ నేర పరిశోధక విభాగం విడుదల చేసిన గణాంకాలు. చేదు వాస్తవాలు. అసలు అత్యాచార వార్తలేని పత్రిక ఏ రోజూ వెలువడటంలేదు. నేరవార్త స్క్రోల్ కాని టీవీ లేదు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు తదితర మరెన్నో నేరాలలో రికార్డు సాధనకు చేరువలో ఉంది. వజ్రోత్సవ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో ఎక్కడో ఓ మూలన ఆందోళన కొట్టొచ్చినట్లుగా కనబడుతూనే ఉంది.
రోజుకు 91 మానభంగాలు :
అవును. మీరు చదివినది అక్షరాలా నిజం. 2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా రోజుకు 91 అత్యాచారాలు, 80 హత్యలు, 289 కిడ్నాప్ లు జరిగాయి. అంతేకాదు. ఇదే సంవత్సరంలో 50.74 లక్షల నేరాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(జాతీయ నేర పరిశోధన విభాగం) గణాంకాలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే 2018లో నేరాల శాతం మరింత పెరిగిందని బ్యూరో వెల్లడించింది. 2017తో పోల్చితే 2018లో నేరాల నిష్పత్తి 1.8శాతం పెరిగింది.
సంరక్షణ కేంద్రాల్లోనూ మాన భంగాలే:
మహిళలు, బాలికల సంరక్షణ కేంద్రాల్లో రక్షకులే భక్షకులు అన్న చందంగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. బ్యూరో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం 2018 సంవత్సరంలో సంరక్షణ కేంద్రాల్లో 30శాతం వేధింపులు మహిళలు, బాలికలపై జరిగాయి. చాలావరకు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ముజఫర్ పూర్ సంరక్షణ కేంద్రంలో బాలికలపై జరిగిన లైంగిక వేధింపులను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రస్తావించింది.
భయపెడతున్న డిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు ఎంతమాత్రమూ సురక్షితమైన ప్రాంతం కాదన్నట్లుగా భయభ్రాంతులకు గురిచేస్తోంది. 2018లో నమోదైన కేసులు గమనిస్తే దోపిడీలు అత్యధికంగా నమోదైనప్పటికీ అత్యాచారాల భయం అక్కడి పౌరులను వెంటాడుతూనే ఉంది. నేర పరిశోధక విభాగం ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే ఎక్కువగా దోపిడీ, దొంగతనాల కేసులే 80శాతంగా 2018 సంవత్సరంలో నమోదయ్యాయి. జనవరి 2018 నుంచి డిసెంబర్ 2018 వరకు ఢిల్లీలో 2,49,000 కేసులు నమోదవగా, 2009లో దోపిడీల శాతం 40 ఉంటే అది కాస్తా 2018 నాటికి రెట్టింపై 80శాతానికి చేరడం ఆందోళనకు గురి చేసే అంశం.
తెలుగు రాష్ట్రాల్లో:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వరుస అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామూహిక అత్యాచారాలు సమస్య తీవ్రతను మరింతగా పెంచుతూ ఆడవారి భద్రతపై ప్రభుత్వాలకు సవాల్ చేస్తున్నాయి. ఒక విషాదాన్ని మరువకముందే మరో విషాదం సంభవిస్తూ తల్లిదండ్రుల కంటికి కునుకు పట్టనీయడంలేదు. గడిచిన రెండు మాసాల్లోనే తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మైనర్లపైనా గ్యాంగ్ రేపులు జరుగుతుండటం మరింత విషాదానికి గురి చేస్తున్నాయి.
సికింద్రాబాద్ కార్ఖానాలో బాలికపై ఐదుగురు రేప్ చేయడం సంచలనంగా మారింది. ఐదుగుర్లో ముగ్గరు మైనర్లే అని తేల్చారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికతో పరిచయం చేసుకున్న ధీరజ్, రితేష్ లు.. ఆమెను ఓరోజు హాటల్‌కు పిలిపించుకుని గ్యాంగ్ రేప్ చేశారు. అక్కడితో ఆగకుండా దాన్ని వీడియో తీసి బాలికను బెదిరించడం మొదలుపెట్టారు. 2నెలలుగా బాలికను బెదిరిస్తూ రేప్ చేస్తూనే ఉన్నారు. ఇక వీడియోలు అప్పగిస్తామని మళ్లీ హోటల్‌కు పిలిపించి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతురి పరిస్థితి తెలుసుకున్న తల్లిందడ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంతో విషయం బయటపడింది. ఈ ఏడాది మే మాసంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇక మరో ఘటనలో అనాథ మైనర్‌పై అత్యాచారం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్డులోనే ఈ దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమపేరుతో నమ్మించిన ఓ యువకుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు నింబోలి అడ్డా అనాథాశ్రమంలో ఉంటోంది. ఇంటర్ చదువుతున్న బాలికకు.. దగ్గర్లోనే జిరాక్స్ షాప్‌లో పనిచేస్తున్న నిందితుడు సురేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఫోన్ కొనిచ్చిన సురేష్.. తరచూ కాల్ మాట్లాడేవాడు. ఏప్రిల్ 20న తాను ఫ్రెండ్స్ బర్త్‌డేకు నెక్లెస్ రోడ్‌కు వెళ్తున్నట్లు బాలిక సురేష్‌తో చెప్పింది. తాను వస్తానని చెప్పి అక్కడికి వెళ్లిన సురేష్.. అందరూ బిజీగా ఉన్న సమయంలో బాలికను మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. కారులోకి ఎక్కించి అత్యాచారం చేశాడు. విషయం ఇటీవలే అనాథశ్రమం నిర్వాహకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇక మరో ఘటనలో అనాథ మైనర్‌పై అత్యాచారం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్డులోనే ఈ దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమపేరుతో నమ్మించిన ఓ యువకుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు నింబోలి అడ్డా అనాథాశ్రమంలో ఉంటోంది. ఇంటర్ చదువుతున్న బాలికకు.. దగ్గర్లోనే జిరాక్స్ షాప్‌లో పనిచేస్తున్న నిందితుడు సురేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఫోన్ కొనిచ్చిన సురేష్.. తరచూ కాల్ మాట్లాడేవాడు. ఏప్రిల్ 20న తాను ఫ్రెండ్స్ బర్త్‌డేకు నెక్లెస్ రోడ్‌కు వెళ్తున్నట్లు బాలిక సురేష్‌తో చెప్పింది. తాను వస్తానని చెప్పి అక్కడికి వెళ్లిన సురేష్.. అందరూ బిజీగా ఉన్న సమయంలో బాలికను మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. కారులోకి ఎక్కించి అత్యాచారం చేశాడు. విషయం ఇటీవలే అనాథశ్రమం నిర్వాహకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈఏడాది ఏప్రిల్ నెలలో మాత్రం కేవలం 15రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఒక కేసు నమోదు కాగా ఏప్రిల్ నెల మొత్తంలో ఐదు కేసులు నమోదయినట్టు రికార్డులు చెబుతున్నాయి. దాంతో గతంతో పోలిస్తే ఈ సారి అత్యాచార సంబంధిత నేరాలు పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. 2019 నుంచి మూడేళ్లలో పాత గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా పోలీసు స్టేషన్‌ల పరిధిలో సామూహిక అత్యాచారాల కేసుల వివరాలు పరిశీలిస్తే ఈ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. 2019లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేశారు. 2020లోనూ లాక్‌డౌన్ అమలు చేశారు.
2020, 21 సంవత్సరాల్లో ఏప్రిల్ మాసంలో గ్యాంగ్ రేప్‌లకు సంబంధించి రెండు చొప్పున కేసులు ఈ జిల్లాల పరిధిలో నమోదయ్యాయి. 2019 ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈఏడాది ఏప్రిల్ నెలలో మాత్రం కేవలం 15రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఒక కేసు నమోదు కాగా ఏప్రిల్ నెల మొత్తంలో ఐదు కేసులు నమోదయినట్టు రికార్డులు చెబుతున్నాయి. దాంతో గతంతో పోలిస్తే ఈ సారి అత్యాచార సంబంధిత నేరాలు పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీలో 2019లో 1084 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1104 మంది బాధిత మహిళలపై జరిగిన లైంగిక దాడుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. 2020కి వచ్చేసరికి ఈ కేసులు 1090కి పెరిగాయి. బాధిత మహిళలు 1107 మంది ఉన్నారు. 2021లో కూడా ఏపీలో అత్యాచార కేసులు పెరిగాయి. వాటి సంఖ్య 1100 దాటినట్టు రాష్ట్ర పోలీస్ అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
సంచారమున్న ప్రాంతాల్లోనూ…:
జనాలు పెద్దగా లేని చోట, ఎవరూ గుర్తించరని భావించిన చోట ఎక్కువగా ఈ తరహా నేరాలకు ఆస్కారం గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా నిత్యం అనేకమంది రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయని బిబిసి ఒక కథనంలో పేర్కొంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ.. "మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అక్కరకు రావడం లేదు. రాష్ట్రంలో అన్ని మూలలా నిత్యం దారుణాలు జరుగుతున్నాయి. దిశ చట్టం పేరుతో చాలా ప్రచారం నిర్వహించారు. చివరకు దిశ యాప్‌కే పరిమితమయ్యారు. కానీ అవి సామాన్య, వలస కూలీ మహిళలను ఎలా కాపాడుతాయి. ఇంతగా పెచ్చరిల్లుతున్న వారిని అదుపు చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమయింది. మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయింది"అని ఆమె అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మహిళలపై నేరాలే అదుపు చేసేందుకంటూ జగన్ ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో కొత్త చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం చట్ట సవరణ చేసి 'దిశ చట్టం' తీసుకొచ్చింది.
రాజకీయ జోక్యం ఉండకపోతేనే… :
"గ్యాంగ్ రేప్ ఘటనలపై రాజకీయాలు అత్యంత విషాదకరం. వారి తీరుతో చివరకు బాధితుల వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. నిబంధనల ప్రకారం అత్యాచారానికి గురయిన వారి సమాచారం బయటకు రాకూడదు. కానీ పరామర్శల సమయంలో రాజకీయాల మూలంగా బాధితుల సంబంధీకుల గుట్టురట్టవుతోంది. సహజంగా నిందితులకు ఫలానా పార్టీ అంటూ ఉండదు. అయినా నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అరాచకాలకు పాల్పడుతున్న వారిని అదుపు చేసేందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా విపక్షాల మీద విమర్శలకు ప్రయత్నించడమే విడ్డూరంగా ఉందంటూ"అని సామాజికవేత్త పీ ఏ దేవి వ్యాఖ్యానించారు. అరాచకాలు ప్రబలకుండా, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం నుంచి స్పందన అత్యంత పేలవంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి దారుణాలు వెలుగులోకి రాగానే తగిన రీతిలో స్పందన కనిపించలేదని బీబీసీతో అన్నారు.
ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితులకు ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఆ ఆశలూ నీరుగారే సంఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇటీవలే ఓ అత్యాచార నిందితుడికి బెయిలు మంజూరు చేసే సమయంలో.. ‘బాధితురాలు చెప్పేది నమ్మశక్యంగాలేద’ని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ వ్యాఖ్యానించడం పట్ల మిగతా న్యాయవాదులు విస్మయం చెందారు. ‘ఆఫీస్‌కు రాత్రి 11 గంటలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అతడితో కలిసి డ్రింక్స్ తాగడానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? తెల్లవారే వరకు తనతో కలిసి అతడు ఉండేందుకు ఆమె ఎందుకు అనుమతించింది?’ లాంటి ప్రశ్నలను బాధితురాలిపై సంధించారు.
ఘటన జరిగిన తర్వాత ఆమె అలసిపోయి, నిద్రలోకి జారుకున్నానని చెప్పడం.. భారత మహిళ వ్యవహరించిన తీరులాలేదని చెబుతూ.. ‘అత్యాచారం అయిన తర్వాత మన మహిళలు ఇలా స్పందించర’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు ఎన్నో కథనాలు ప్రసారమాధ్యమాలలో హల్ చల్ చేసాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు... ఒకవైపు మర్డర్లు, మరోవైపు మానభంగాలు. అప్పుడేదో సరదాకోసం తీసుకున్న మాటలు కాస్తా ఇప్పుడు నిజమైపోయి దేశం ఇప్పుడు నిజంగానే క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పే డైలాగ్ ఒకటి నవ్వులు పూయిస్తుంది. `ఒకవైపు మర్డర్లు, మరోవైపు మానభంగాలు.` అప్పుడేదో సరదాకోసం తీసుకున్న మాటలు కాస్తా ఇప్పుడు నిజమైపోయి దేశం నిజంగానే క్లిష్టపరిస్థితుల్లో ఉంది. నిర్భయ చట్టం, దిశ చట్టం అంటూ ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేరస్తుల్లో ఆశించిన మార్పు కనిపించడంలేదు. బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి పటిష్టమైన పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
సంతృప్తి

డా. శ్రీభాష్యం అనూరాధ,
తెలుగుఅధ్యాపకులు
లక్ష్యాన్ని సాధించినపుడు కలిగే తృప్తి అనుభవైకవేధ్యం....
దీనికి సంబంధించిన ఒక సంఘటన ...
గురుకుల విద్యాలయసంస్థలో ఓ పాఠశాల ....ఆపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది 'సరిత'.
సరిత చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది. కానీ కళ్ళలో మాత్రం ఏదో మెరుపు...
ఓ రోజు యధావిధిగా తరగతులు కొనసాగుతున్నాయి.సరిత క్లాస్ లో ఫిజిక్స్ పాఠ్యభోధన సాగుతున్నది.ఫిజిక్స్ ఉపాధ్యాయిని పరిశోధనల గురించి,అవిచేసిన శాస్త్రవేత్తలు, ప్రయోగాల విజయాలను వివరించింది.సరిత ఏదో ఆలోచనలో పడిపోయింది.ఫిజిక్స్ క్లాస్ అయిపోయిందన్న సంకేతంగా బెల్ కొట్టారు. తర్వాత తరగతి 'తెలుగు'.ఉపాధ్యాయిని వచ్చింది.విద్యార్థులంతా లేచి నమస్కరించారు.ప్రేమతో వారిని పలకరిస్తూ,అన్యమనస్కురాలైన సరితను చూసింది టీచర్."ఏమి ఆలోచిస్తున్నావ్ సరితా?" అంది.తడుముకోకుండా సరిత"మేడం నేను శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?"అంది.అందరూ ఘొల్లున నవ్వారు.విద్యార్థులందరిని వారించి,నెమ్మది పరిచింది.ఆతర్వాత "పట్టుదల ఉంటే కాగలడు మరొబ్రహ్మ"అనే కథను(కలాం)వినిపించింది ఉపాధ్యాయిని.అది సరిత శ్రద్ధతో విన్నది..... అలా కొన్ని రోజులు గడిచాయి.. ఉపాధ్యాయిని మరోచోటికి బదలీపై వెళ్ళింది.
దాదాపు15సం. తర్వాత ఓ రోజు ఉపాధ్యాయినికి ఫోన్ మోగింది."ఈ విదేశపు కాల్ ఎవరిదా.."అంటూ ఫోన్ ఎత్తింది.అటువైపు నుండి గద్గద స్వరంతో.."మేడం..ఎన్ని రోజులు నుండి మీకోసం,మీ ఫోన్ నంబర్ కోసం ఎదురు చూసాను.ఇన్నాళ్లకు దొరికింది.మీరిచ్చిన సూర్తితో ,నేను కోరుకున్నట్లు పరిశోధన విభాగంలో పనిచేస్తున్నాను.భవిష్యత్తులో శాస్త్రవేత్తను అవుతాను మేడం.."అని చెప్పింది సరిత. ఉపాధ్యాయిని కళ్ళలో నీళ్లు తిరిగాయి.ఇద్దరు తృప్తిగా మాట్లాడు కున్నారు.ఆ మాటల్లో తాను న్యూజెర్సీ(US)లో(Anneal Pharmaceutical ) Analytical సైటిస్ట్ గా పనిచేస్తున్నానని తెలిపింది..యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సరిత మాటల్లో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం సంతృప్తితో గడుపుతున్న జీవితం, ఆప్యాయతలు గమనించిన ఆ ఉపాధ్యాయిని ఆనందపడింది."తాను వేసిన మొక్క నీడనిచ్చెనంతగా ఎదిగి,ఆదర్శంగా నిలిచినందుకు..ఆనందించింది.
సంతృప్తి..అనే విలువ అమూల్యమైనది.అది స్వీయకృతి.
"విజయం ఫుల్ స్టాప్ కాదు.ప్రయాణం"అన్న కలామ్ మాటలు గుర్తొచ్చాయి.ఈ ఆనందం స్ఫూర్తిగా తీసుకొని,జీవితాన్ని విజయబాటలో నడచి,మరో ఐన్ స్టీన్,కలాం కావాలని కోరుకుంది ఉపాధ్యాయుని...

వివక్షను గెలిచిన విజేత
- సరోజన బోయిని
కాలం ఏదైనా గానీ మన సమాజంలో మహిళలు తమ పట్ల వివక్షను ఎదుర్కొంటూనే వస్తున్నారు..
తమ హక్కుల కోసం,సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు..
మరి ఇది అందరితో సాధ్యమా అంటే దానికి సమాధానం తన లోని ఆత్మ విశ్వాసాన్ని బయటకు తీసి దైర్యంగా నిలబడి ఒక్క మహిళ వేసే ముందడుగే మిగితా వాళ్లకు మార్గ దర్శకంగా మారుతుంది.
తమ హక్కుల కోసం,సమస్యల కోసం తామే పోరాటం చేసి సాధించు కోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావడానికి పునాదిగా నిలుస్తుంది.
ఇప్పడి వరకు మహిళలు సాధించుకున్న హక్కులు ఎన్నో..
ఎన్నో దురాచారాలు,మరెన్నో మూఢనమ్మకాలు నుండి తమని తాము రక్షించుకుంటున్న గానీ ఇంకా,ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే వున్నారు. మహిళలు ఇలాంటి సమస్యల నుండి బయటపడడం లో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడంలో కొంత మంది మహానుభావులు అయిన ప్రగతిశీల పురుషుల సహకారం ,వారి తోడ్పాటుతోనే వాటిని అధిగమించారు..
మహిళలకు చదువు అనేది ఒకప్పుడు నోటికందని కూడు. ఇందుకు కారణం బాల్య వివాహాలు కావచ్చు,ఆడపిల్ల బయట ప్రపంచంలో తిరగడం ఇష్టం లేని తల్లి,తండ్రులు కావచ్చు,ఆడపిల్లకు చదువు ఏంటి అనే వివక్ష కావచ్చు..
చదువుతో మహిళ బుద్ధి బలం పెరిగి తమ హక్కుల కోసం ఈ సమాజాన్ని ఎక్కడ నిలదీస్తుందో అన్న భయం కావచ్చు.
ఆడపిల్ల చదువు లేక వంటింటికే పరిమతం కావాల్సి వచ్చింది.
కానీ మహిళల్లో మార్పు కొద్ది,కొద్దిగా చదువు అందుకుంటూ ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది..
అలాంటి వాళ్లలో ఒకరు.. అయ్యలసోమయాజుల లలిత భారతదేశ మొదటి మహిళా ఇంజనీర్..మన తెలుగింటి ఆడబిడ్డ..
ఆ కాలంలో ఇంట్లో ఆడపిల్ల ఉంది గుండెల మీద కుంపటిలా భావించేవారు..దీనికి తల్లితండ్రులు నిరక్షరాస్యులా అక్షరాస్యులా ఉన్నత స్థానంలో ఉన్నవారా ? అనే తేడా ఏం లేకుండా ఆడపిల్ల పెళ్లి విషయంలో ఒకే ఆలోచన ..
ఒక స్త్రీ ముందడుగు వేయడంలో పురుషుని సహకారం ఎంతనో వారి అనుమతి కూడ అంతే అవసరంగా ఉండేది..ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఇప్పడికి ఈ ధోరణిలో మార్పు రాలేదు..
కానీ ఒక ఆడ పిల్ల చదువు అంటేనే విడ్డురంగా చూసే సమాజంలో అప్పటి తన పరిస్థితులకు ఎదురుతిరిగి .. తాను చిన్న వయస్సులో ఒక బిడ్డకు తల్లి అయి భర్తను కోల్పోయినప్పటికీ ..తిరిగి తన చదువు కొనసాగించి ఇంజనీరింగ్ పూర్తి చేసింది అయ్యలసోమయాజుల లలిత .
భర్తను కోల్పోయిన స్త్రీకి తెల్ల బట్టలు కట్టించి ఇంట్లో ఓ చీకటి గదే తన ప్రపంచగా భావించాలి అనే ఈ సమాజపు మూర్కత్వాన్ని సవాల్ చేస్తూ తన చదువు కొనసాగించింది ఆమె..
1919ఆగష్టు27న మద్రాసులో అంటె నేటి చెన్నైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు లలిత. తండ్రి పప్పు సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫసర్. అమెకన్న పెద్దవారు నలుగురు ,చిన్నవారు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు .ఆనాటి సమాజ పద్దతుల ప్రకారం ఇంకా స్కూల్లో చదువుకుంటుండగానే,15 ఏళ్ళ వయసుకే 1934 లో లలితకు పెళ్లి చేసారు. ఆ తరువాత కూడా కొన్నాళ్ళు స్కూల్లో విద్య కొనసాగిన పదో తరగతిలో ఆమె చదువు ఆపేశారు .
1937 లో శ్యామలకు జన్మనిచ్చారు లలిత.కూతురు పుట్టిన నాలుగు నెలలకే భర్త చనిపోవడంతో తండ్రి ,సోదరుల ప్రోత్సాహంతో ముందుగా క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు
పని చేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండీలోనే ( సి.ఈ.జి) 1940లో నాలుగేన్లు ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. తండ్రి సిఫార్సులో ఆమెకు అక్కడ దొరకడం తేలికయింది.
1940లో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఊహించడం కష్టం. అసలు అమ్మాయిలే ఇంజనీరింగ్ కాల్లేజిల్లో లేని ఆ కాలంలో ముగ్గురు మహిళలు (సి.ఈ.జి)లో చదువుకున్నారు లీల్లమ్మజార్జ్, థెరిస్స సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో లలిత కీ జూనియర్ గా చేరిన రెండో ప్రపంచ యుద్దం వల్ల ముగ్గురు 1943లో ఇంజనీరింగ్ పట్టా పొందారు ఫిబ్రవరి 1944లో ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్ లో( 'హి పాసుడు ది ఎక్సమినేషన్')అనే వాక్యంలో 'హీ' అనే పదాన్ని కొట్టేసి 'షీ' అని చేతితో సవరించడం ఆనాటి పరిస్థితులకి అద్దం పడుతుంది.మహిళ విద్యార్థులు ఈ కోర్సులు చేయడం అరుదంటే వారి జెండర్ కోసం ప్రత్యేకించి సర్టిఫికేట్స్ తయారు చేయించలేరు లేదా హీ. షీ అనే ఎంపిక ఇవ్వలేదు అలాంటి కాలంలో ముగ్గురు మహిళలు పట్టా భద్రులయ్యారు తన కూతురి ఆరేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు బంధువుల దగ్గర తన కూతురిని ఉంచి కుటుంబసభ్యుల సహకారంతో ఇంజనీరింగ్ పూర్తి చేసింది
డిగ్రీ పూర్తి చేయడానికి కావాల్సిన ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం లలిత 1943లో ఒక ఏడాది పాటు "జమల్ పూర్ వర్క్ షాప్ లో పనిచేశారు అది ఈస్ట్ ఇండియా కంపెనీ" వారు 1862లో ప్రారంభించిన పూర్తిస్థాయి వర్క్ షాప్ ఫెసిలిటీ. తరువాత 1944లో ఆమె "సెంట్రల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా" సినిమాల్లో ఇంజనీర్ గా అసిస్టెంట్ గా పని చేశారు.తర్వాత తండ్రికి రీసెర్చ్ లో సాయం చేయడానికి ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. లలిత తండ్రి పేరు మీద అనేక పేటెంట్లు ఉన్నాయి.
1948లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఆ పని కూడా మానేయాల్సి వచ్చింది. 1928లో స్థాపించిన "బ్రిటిష్ కంపెనీ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్" కు చెందిన కలకత్తా ఆఫీసులో ఎలక్ట్రికల్ విభాగంలో లలిత చేశారు. అక్కడ "డిజైన్ ఇంజినీర్ గా ట్రాన్స్మిషన్ లైన్స్"మీద చేసిన పని ఆమెకు గుర్తింపు తెచ్చింది.
పురుషులే అధికంగా ఉండే పని స్థలాల్లో ఆమె ఇన్ని ఉద్యోగాల బాధ్యతలను సింగిల్ పేరెంట్ గా ఆ రోజుల్లోనే నెట్టుకొని వచ్చారు. కుటుంబానికి దగ్గరగా ఉండి కూతుర్ని బాగా చూసుకోగలిగే నిర్ణయాలే కెరీర్ పరంగా తీసుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన అంతమవడంతో మహిళలకు ఇంజనీరింగ్ లో అవకాశాలు పెరిగాయి. అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను ప్రపంచం మీద నిలబెట్టిన వారు లలిత..
ఆమె 1953లో" ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్(IEE) కౌన్సిల్" లో అసోసియేట్ మెంబర్ గా ఆ తరువాత 1966 లో పూర్తిస్థాయి మెంబర్ గా ఎన్నికయ్యారు.
జూన్ 1964లో న్యూయార్క్ లో జరిగిన తొలి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి ఐ సి డబ్ల్యూ ఈ ఎస్(ICWES) ఆహ్వానాన్ని అందుకున్నారు. లలిత అప్పటికి ఆ సంస్థకు ఇండియాలో ఎలాంటి చాప్టర్ లేకపోయినా ఈ ఆహ్వానం రావడం దానికోసం వ్యక్తిగత స్థాయిలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆమె ఆ సమావేశానికి హాజరు కావడం విశేషం. ఆ సమావేశంలో 35 దేశాల నుంచి 500 మంది మహిళ ఇంజనీర్లు పాల్గొన్నారు.
జీవితాంతం ముళ్ళబాటలో నడిచి గెలిచిన లలిత 60 ఏళ్ల వయసులో రిటైర్ అయిన రెండేళ్లకే అనగా 1979 అక్టోబర్ 12న బ్రెయిన్ ఎన్యూరిజం (brain aneurysm) కి గురై మృతి చెందారు.
***