మహిళా లోక శిరోమణి -లక్ష్మీబాయమ్మ
- డాక్టర్ దాసోజు పద్మావతి
ఆమె ఒక వ్యక్తి కాదు. మహాశక్తి అని నిరూపించిన ధీర వనిత. తెలంగాణ వీరనారి. స్త్రీల ఆత్మాభిమానానికి ఆమె దిక్చూచి. మహిళాభ్యుదయానికి పాదుకొల్పిన స్వతంత్ర సమర యోధురాలు. భరత మాత ముద్దుబిడ్డ. మన సంగం లక్ష్మీ బాయమ్మ.
రంగారెడ్డి (ప్రస్తుతం మేడ్చల్) జిల్లాలోని ఘట్కేసర్ లో 1911 జులై 27వ తేదీన లక్ష్మీబాయమ్మ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సీతమ్మ గోగు రామయ్యలు.తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్తెమ్మ లక్ష్మీబాయమ్మ కు చిన్నతనంలోనే దుర్గా ప్రసాద్ యాదవ్ తో వివాహం జరిగింది. అత్తింటి వారు లక్ష్మీ బాయి అని మార్చారు. ఆమె బాల్యంలోనే తల్లిదండ్రులని కోల్పోయింది. వివాహమైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమె మేనమామ సంగం సీతా రామయ్య శారదా నికేతన్ లో చేర్పించేటప్పుడు ఇంటి పేరు సంగెంగా వ్రాయించడంతోసంగం లక్ష్మీ బాయమ్మ అయింది.
ఆమె శారదా నికేతన్ లో చదువు కుంటున్న రోజుల్లో నే తన తోటి అమ్మాయిలను ప్రోత్సహించేవారు. విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1927లో సైమన్ కమిషన్ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కల్లు, సారా అమ్మకాలు నిషేధించాలని స్త్రీలతో కలిసి ఉద్యమించారు.విదేశీవస్త్ర బహి ష్కరణలో చురుకుగా పాల్గొన్నారు.1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్ట య్యారు రాయ వెల్లూరు జైల్లో సంవత్సరకాలం శిక్షణ అను భవించారు. జైల్లో ఉన్నప్పుడు కూడా స్త్రీలకు ప్రత్యేక మైన గదులు కేటాయించాలని ఉద్యమించారు. జైలు నుండి విడుదలైన తర్వాత మద్రాస్ వచ్చి చిత్రకళలో శిక్షణ తీసుకొని 1933 లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డిప్లమా అందు కున్నారు.
ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి నారాయణ గూడలోని రాజ బహుదూర్ వెంకట రాంరెడ్డి మహిళా కళా శాలలో గౌరవ వార్డెన్ గా బాధ్య తలు చేపట్టారు. స్వామి రామానంద తీర్థ ప్రోత్సాహంతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహిళ కన్వీనర్ గా పనిచేశారు. మహిళాభ్యుదయం కోసం విశేష కృషి చేసిన స్త్రీ మూర్తి లక్ష్మీ బాయమ్మ. ఆమె హైదరాబాదులో స్త్రీ సేవా సదన్ నడిపారు. రాధికా ప్రశూతి చికిత్సా లయం, వాసు శిశు విహార్ మరియు మా శెట్టి హను మంత గుప్తా హై స్కూల్ స్థాపించ డంలో కీలక భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి కోశాధికారిగా పనిచేశారు. భారత స్వాతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయం అది 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళా శక్తిని నిరూపించిన స్త్రీ మూర్తి.ఆమెతో పాటు ఎందరో భారతీయులు ఉద్యమం వైపు వెళ్లారు.1947 నుంచి 1948 వరకు రాష్ట్ర స్థాయిలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక భూమిక పోషించారు.
ఉద్యోగాన్ని వదిలిపెట్టి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. విముక్తి పోరాటంలో మహిళల్ని ముందుండి నడిపించారు. సోయబుల్లాఖాన్ మరణించినప్పుడు ఎవరు కూడా ఆ కుటుంబాన్ని కనీసం పలకరించ డానికి కూడా వెళ్లలేదు. కానీ సంగెం లక్ష్మి బాయమ్మ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి, మనో ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలిచారు. ఆమె ధైర్య సాహసాలకు ప్రతీక అని మరో మారు నిరూపించారు. 1950 ప్రాంతంలో ఆచార్య వినోబాభావే తెలంగాణ ప్రాంతంలో పర్యటించినప్పుడు వారి ఉపన్యాసాల్ని తెలుగులోకి అనువదించారు. 16 గ్రామాలు లక్ష్మీబాయమ్మ స్వయంగా పర్యటించి 314 ఎకరాల భూమిని సేకరించి వినోబా భావే గారికి అంద జేశారు.ఆతరువాత బాన్సువాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 1954 నుండి 1956 వరకు విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేసే చేశారు. ఎన్నో సంస్కర ణలు తీసు కొచ్చారు. ఆమె కాలంలోనే బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. 1952లో అనాధ బాలికల సంక్షేమం కోసం ఇందిరా సేవా సదన్ ను స్థాపించారు. ఈ సదన్ నుండి అనేక సేవా కార్య క్రమాలు చేసారు. బాలికా సంక్షేమం కోసం విద్యా, స్వయం ఉపాధి, వంటి కార్య క్రమాలు చేపట్టారు. నెహ్రూ ఇందిర సదన్ ను స్వయంగా సంద ర్శించారు. ఆ తర్వాత 1957లో 1960లోను, 67లో మూడుసార్లు లోకసభకు మెదక్ నుంచి ఎన్నికై నారు. తెలంగాణ నుండి లోకసభకు ఎన్నికైన తొలి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి సంగెం లక్ష్మీ బాయమ్మ.మహిళాభ్యుదయం కోసం విశేషంగా కృషి చేసిన మహిళా లోక శిరో మణి మన లక్ష్మీబాయమ్మ.
