లక్ష్యాన్ని సాధించినపుడు కలిగే తృప్తి అనుభవైకవేధ్యం....
దీనికి సంబంధించిన ఒక సంఘటన ...
గురుకుల విద్యాలయసంస్థలో ఓ పాఠశాల ....ఆపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది 'సరిత'.
సరిత చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది. కానీ కళ్ళలో మాత్రం ఏదో మెరుపు...
ఓ రోజు యధావిధిగా తరగతులు కొనసాగుతున్నాయి.సరిత క్లాస్ లో ఫిజిక్స్ పాఠ్యభోధన సాగుతున్నది.ఫిజిక్స్ ఉపాధ్యాయిని పరిశోధనల గురించి,అవిచేసిన శాస్త్రవేత్తలు, ప్రయోగాల విజయాలను వివరించింది.సరిత ఏదో ఆలోచనలో పడిపోయింది.ఫిజిక్స్ క్లాస్ అయిపోయిందన్న సంకేతంగా బెల్ కొట్టారు. తర్వాత తరగతి 'తెలుగు'.ఉపాధ్యాయిని వచ్చింది.విద్యార్థులంతా లేచి నమస్కరించారు.ప్రేమతో వారిని పలకరిస్తూ,అన్యమనస్కురాలైన సరితను చూసింది టీచర్."ఏమి ఆలోచిస్తున్నావ్ సరితా?" అంది.తడుముకోకుండా సరిత"మేడం నేను శాస్త్రవేత్తను కావాలంటే ఏమి చేయాలి?"అంది.అందరూ ఘొల్లున నవ్వారు.విద్యార్థులందరిని వారించి,నెమ్మది పరిచింది.ఆతర్వాత "పట్టుదల ఉంటే కాగలడు మరొబ్రహ్మ"అనే కథను(కలాం)వినిపించింది ఉపాధ్యాయిని.అది సరిత శ్రద్ధతో విన్నది..... అలా కొన్ని రోజులు గడిచాయి.. ఉపాధ్యాయిని మరోచోటికి బదలీపై వెళ్ళింది.
దాదాపు15సం. తర్వాత ఓ రోజు ఉపాధ్యాయినికి ఫోన్ మోగింది."ఈ విదేశపు కాల్ ఎవరిదా.."అంటూ ఫోన్ ఎత్తింది.అటువైపు నుండి గద్గద స్వరంతో.."మేడం..ఎన్ని రోజులు నుండి మీకోసం,మీ ఫోన్ నంబర్ కోసం ఎదురు చూసాను.ఇన్నాళ్లకు దొరికింది.మీరిచ్చిన సూర్తితో ,నేను కోరుకున్నట్లు పరిశోధన విభాగంలో పనిచేస్తున్నాను.భవిష్యత్తులో శాస్త్రవేత్తను అవుతాను మేడం.."అని చెప్పింది సరిత. ఉపాధ్యాయిని కళ్ళలో నీళ్లు తిరిగాయి.ఇద్దరు తృప్తిగా మాట్లాడు కున్నారు.ఆ మాటల్లో తాను న్యూజెర్సీ(US)లో(Anneal Pharmaceutical ) Analytical సైటిస్ట్ గా పనిచేస్తున్నానని తెలిపింది..యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సరిత మాటల్లో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం సంతృప్తితో గడుపుతున్న జీవితం, ఆప్యాయతలు గమనించిన ఆ ఉపాధ్యాయిని ఆనందపడింది."తాను వేసిన మొక్క నీడనిచ్చెనంతగా ఎదిగి,ఆదర్శంగా నిలిచినందుకు..ఆనందించింది.
సంతృప్తి..అనే విలువ అమూల్యమైనది.అది స్వీయకృతి.
"విజయం ఫుల్ స్టాప్ కాదు.ప్రయాణం"అన్న కలామ్ మాటలు గుర్తొచ్చాయి.ఈ ఆనందం స్ఫూర్తిగా తీసుకొని,జీవితాన్ని విజయబాటలో నడచి,మరో ఐన్ స్టీన్,కలాం కావాలని కోరుకుంది ఉపాధ్యాయుని...
డా. శ్రీభాష్యం అనూరాధ,
తెలుగుఅధ్యాపకులు
