‘యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యైనమస్తస్యైనమోనమ:
అనగా సమస్త శక్తి రూపాల్లో నెలవైయున్న ఆదేవికి మాటిమాటికీ నమస్కృతులని అర్థం .
అలాంటి శక్తి స్వరూపిణి యైన స్త్రీని గురించి ‘స్రీ వ్యక్తికాదు శక్తి. .‘మనజాతి ఇంతగా దిగజారిన పోవడానికి కారణం స్త్రీ లను గౌరవించకపోవడమే ‘అన్నారు స్వామీ వివేకానందుల వారు.
‘ఆధునిక మహిళ చరిత్రను తిరగ వ్రాస్తుందన్నారు' గురజాడ .
స్రీ ఆర్ధికంగానిలద్రొక్కు కోవాలని విద్యావంతురాలు కావాలని స్త్రీ వ్యక్తిత్వం వికశించాలని కందుకూరి వీరేశలింగం గారు వంటి సంస్కర్తలుఅన్నారు కృషి చేశారు ,,
స్త్రీలు చైతన్యశీలురు. దేశస్వాతంత్ర్య సమరంల ,స్వాతంత్ర్య సమరానికి పూర్వం, ఉద్యమాలలో పాల్గొనిన వీరవనితలెందరో యెందరో అందరికీ వందనాలు. అభినందనలు.
ప్రపంచచరిత్రలో సామ్రాజ్యాలనేలిన శౌర్యలలామలెంతమందో ఉన్నారు.
తెలుగులో తేజోవిరాజిత, తెలుగు సింహాసనాన్నధిరోహించి కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిని, అరివీరభయంకర ఆదిశక్తిగా పాలించిన తొలి తెలుగురాణి. కాకత రుద్రమరాణి. రాజ్యతంత్ర్రయంత్రాంగాలతో ప్రజారంజకంగా మెలిగిన మొదటి రాణి. కాకతిరుద్రమదేవి.
మంత్రిత్వం. జరిపి ,మహిళల్లోనే మహా నాయకురాలిగా నాయకురాలు నాగమ్మగా ఆంధ్రవనితల పౌరుషానికి. అద్దంపట్టిన దీశాలిని పలనాటినాగమ్మ .
మహాత్ముని పిలుపు విని స్వాతంత్రోద్యమంలో ఉరికిఝాన్సీరాణి పోరాటపటిమన స్పూర్తిగా తీసుకొని, దేశమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి సాయశక్తులా కృషి చేసారు .
‘స్త్రీలు తాము అబలలమన్న మాట మరిచిపోతే పురుషులకంటే గొప్పగా పోరాడిగలరనడంలో నాకెలాంటి సందేహం లేదంటారు గాంధీజీ ‘..
‘మత విద్వేషాలను రూపుమాపి అస్ప్రశ్యత అనైక్యతలను చెండాడి ,అసామరస్యాన్నిపారద్రోలి , ప్రజలకు స్వశక్తితో ఆధారపడే శిక్షణనిచ్చి ,ముఖ్యంగా స్త్రీలను పురుషులతో పాటు.
సాంఘికంగా ఆర్ధికంగా రాజకీయంగా సమస్థితికి తెచ్చి. భారతదేశాన్ని ఉధ్దరించాలన్నదే
గాంధీజీ ఆశయం అంటారు డా::సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు .
‘‘గాందీ జీ హండ్రెడ్. ఇయర్సు ‘ అనే పుస్తకంలోఆయన ఈ విషయం వ్రాసారు .
“మహిళాశక్తిని మహాత్ముడు ఇంత మహనీయంగా గుర్తించడం వలననే స్వాతంత్రోద్యమంలో అన్ని తరగతుల వర్గముల స్త్రీలు యధేచ్ఛగాఉద్యమాలలో పాల్గొన్నారు ,స్త్రీలు పాల్గొనడానికి పురుషులు అనుమతించడం కూడా జరిగిందని ‘పండిట్ నెహ్రూ ‘అనిన మాటలు అక్షర సత్యాలు.
మహాత్ముని అడుగు జాడలలో నడిచి స్వాతంత్రోద్యమానికి వన్నెతెచ్చిన మహిళామణులగూర్చి తెలుసు కుందాం .
దేశబాంధవి దువ్వూరి.సుబ్బమ్మగారు భర్త పోయినపుట్టాడు దు:ఖాన్న గుండెలలో దాచుకొని ‘భారతమాత దాస్యశృంఖలాలు ఛేదించడానికి స్వాతంత్రోద్యమంలోనికి ఉరికిన దేశభక్తురాలు.
ఆడపిల్లలు పాఠశాలకు వెళ్ళి చదువుకున అవకాశాలు లేని రోజులలోనే, ఈమె స్వయం ప్రతిభతో పాండిత్యం సంపాదించారు... సహాయనిరాకరణోద్యమంలో శిక్షణ పొందిన రెండవ భారతీయ మహిళ సుబ్బమ్మగారు. .నాలుగు సంవత్సరాలపాటు కఠిన కారాగార శిక్షకు గురైన ఈమె పోలీసు వారికి పెద్ద సమస్యగాతయారైంది . జైల్లో సదుపాయాలు లేవని గొడవచేస్తే విడుదలై రెచ్చగొట్టే ఉపన్యాసాలిస్తోందని మళ్లీ అరెస్టు చేసారు .క్షమాపణ చెప్తే వదిలేస్తామన్నారట నాటి కలెక్టర్ .
నాకాలి గోరుకూడా మీకు క్షమాపణ చెప్పదు అన్నారట .
వంద రూపాయలు జరిమానా వేసి డబ్బులిస్తే వదిలేస్తామంటే ,నాగుండు తప్ప నాకే ఆస్థి లేదని ముసుగు తీసి గండు చూపారట. లాఠీ చార్జీ చేయడానికి వస్తే, నేనెలాగ గంగా భాగీరధినే ఈ ఆంగ్లేయుల పాలన గంగలో కలిపేవరకూ పోరాటం ఆపనని భీషణ ప్రతిజ్ఞ చేసేవారట.
ఆమె ధైర్యం పోరాటపటిమా దేశభక్తి చూసిన గాంధీజీ ఆమెను 1923 లో దేశ బాంధవి అని ప్రశంసించారుట. ఈ దేశభక్తురాలు 1964 మేనెల 31 దేశమాతలో ఐక్యం చెందారట ..
శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారు. హైదరాబాదులో ఘోష పధ్దతులుగలరోజులు .
స్త్రీలు వీధులలో తిరగ కూడదని నిషేదాజ్ఞలున్నప్పుడే’ నాటి స్వతంత్రయోధులతో కలసి వీధులలో తిరిగి ప్రచారం చేసేవారట .
ఈ సంఘ సేవకురాలు 1927 లో కస్తూరిభ గాంధీ హైదరాబాద్ వచ్చినపుడు ఆమె సమక్షంలో మాట్లాడి సమస్యలను చెప్పి ఆమె ప్రశంసలు పొందారట .
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారీ ప్రచారం చేసారట .
గోల్కొండపత్రికలో రచయిత్రి కూడా అయిన ఈమె అనేక వ్యాసాలు వ్రాసారట.
సేవాస్పూర్తి ,హేతువాదకీర్తిసరస్వతీ గోర. గోపరాజు రామచంద్రయ్యగారి సహధర్మచారిణి .
‘సమాజసేవకురాలు ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు.అనేకఉద్యమాలలోపాల్గొని
జైలుశిక్షలు అనుభవించారు. కొన్నా ళు గాంధీగార సేవాగ్రామ్ సేవచేసారు.
గాంధీగారి అడుగు జాడలలో నడిచినవీరు ఆదర్శాలు చెప్పడమ కాదు ఆచరించి చూపినఆదర్శమహిళ.
స్త్రీ స్వేచ్చావాది మల్లాద సుబ్బమ్మగారు అణుగారి పోతున్న మహిళల హక్కులకోసం అనుక్షణం పోరాడారు . అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు .న్యావాదిగా సమాజ సేవకురాలిగా గొప్ప దేశభక్తు రాలిగా సుబ్బమ్మగారు వెలకట్టలేన సేవలు చేసారు .
కష్టాలకొలిమిలో కాలుతున్నా ఉద్యమాలకు ఊపిరి పోసిన కొండపల్లిఈశ్వరమ్మగారు. వందేమాతరం పాడిన వారిసి లాఠీలతో కొట్టడం. జైళ్ళలో పెట్టడంచూసి, చిన్నారి బాలవితంతువు ఈశ్వరమ్మకు ఆంగ్లేయులపై కోపం కల్గింది. ఆ పసిపిల్లకే అసహ్య భావంకల్గించాయివారి చర్యలు. మధురమైనకంఠంతో మంచి గీతాలాలపించేది.
ఆరోజుల్లో ఖద్దరుధరించడం విదేశీ వస్తు దహనం సత్యాగ్రహ పోరాటం ఆమెను స్పందింపజేసాయి. జాతీయోద్యమం. కమ్య్యూనిష్టు ఉద్యమం . ప్రజానాట్యమండలిలలో. అనేక ప్రజాసంఘాలలో పనిచేసిన కొండపల్లిఈశ్వరమ్మగారు గొప్ప చైతన్య శీలి.
గుంటూరు ఝాన్సీగా ఆంగ్లేయుల గుండెల్లో అగ్ని పర్వతాలు ప్రేల్చిన ‘ఉన్నవ లక్ష్మీ బాయమ్మ‘శుధ్ధ గాంధేయవాది. ‘ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి‘ ధర్మపత్ని. 1921 గాంధీగారి సహాయం నిరాకరణోద్యమ సమయంలో, భర్తతోపాటు పాల్గొనడమే గాక భర్త కారాగారంలో ఉన్నప్పుడు ఆంధ్ర దేశమంతటా పర్యటించి. సత్యాగ్రహోద్యమానికి ప్రచారం చేసారు. వేలాది మందిని ఉద్యమించేలాచేసిన వీరవనిత . జన సమీకరణలో గొప్ప నిపుణురాలు. ఎన్నోసార్లు జైలు పాలయి భయంకరహింసలకు గురైనా, దేశ భక్తి విడువలేదు .
తమకలలు సాకారమై స్వాతంత్ర్యం వచ్చాక,1956 లో అశువులు బాసారు ఈ యోధురాలు .
నెల్లూరు విప్లవకణిక పొణకా కనకమ్మ గారు.
‘ఎక్కడ స్త్రీ విద్య ఉధ్దరింపబడిందో ,ఎక్కడ మహిళల ప్రాధమిక హక్కులు రక్షింప బడినవో
ఎక్కడ రైతు ఉద్యమాలు పుష్పించి ఫలించి బడినవో అక్కడ కనకమ్మ పేరు కనబడుతుందివినబడుతుంది . .ఆమె మూర్తి కనబడుతుంది అని ఈ ధీరవనితను త్యాగమూర్తి
కీర్తించారు పద్మ విభూషణ్ కొండారెడ్డి గారు .
మొక్కవోని కార్య దీక్షతో మాత్రు దేశదాస్య విముక్తికి జీవితాన్ని త్యాగం చేసిన కర్మ యోగిని
పొణకా కనకమ్మ గారు .
త్యాగమూర్తి మాగంటి అన్నపూర్ణాదేవి .జాతిపిత గాంధీ మహాత్ముడు అతి చిన్న వయసులోనే
కన్నుమూసిన అన్నపూర్ణాదేవిని తలచు కుంటూ శ్రధ్ధాంజలి ఘటించాట ,
‘నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ తనకున్న బంగారు నగలన్నిటినీ దేశంకోసం నాకు సమర్పించిన
తొలిభారత మహిళ ఆమెయే. నాఆదృష్టం కొలదీ నన్ను తండ్రిగా భావించి సేవించిన పుత్రికలలో
ప్రథమగణ్యురాలు అన్నపూర్ణేఅన్నారట కంటతడి పెడుతూ గాంధీజీ .
స్వదేశీఉద్యమానికి. సర్వస్వం ధారపోసి విదేశాల నుండి వచ్చిన భర్త కు స్టీమర్ దిగిన సమయంలోనే స్వయంగా వడికిన ఖద్దరు బట్టలిచ్చి కట్టుకోమని అతనిని కూడా దేశ సేవకు అంకితం కావాలని ప్రభోదించిన. అన్నపూర్ణాదేవి సేవలు అనన్య సామాన్యం .
పద్మజానాయుడు .తల్లి తొలి గవర్నరు సరోజినీనాయుడు . కుమార్త్లె పద్మజానాయుడు .
తొలితెలుగు మహిళాగవర్నర్ . గొప్ప దేశభక్తురాలు స్వతంత్రోద్యమ నాయకు రాలు. .
యుక్త వయస్కురాలిగా ఉన్నప్పుడేఈమె స్వరాజ్య నిధిని పోగు చేయడంలో ఈమె జాతీయ నాయకులుకు సహాయపడింది .
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నిజాం రాజ్యంలో నిషేదాజ్ఞలను ధిక్కరించి
గాంధీజీజయంతి ఉత్త్సవం నిర్వహించినందుకు నిజాం ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది .
స్వాతంత్రోద్యమంలో ఈమె క్రియాశీలక పాత్ర పోషించింది . గొప్ప రాజనీతిజ్ఞురాలు .
‘శ్రీమతి దిగుమర్తి.జానకీబాయమ్మ గొప్ప స్వాతంత్రోద్యమవీరురాలు .తండ్రి విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు శ్రీ మల్లెడుగుల బంగారయ్య. తల్లి లలితమ్మ .గొప్ప దేశ భక్తురాలు .భర్త దిగుమర్తి .వేంకట రామాస్వామి నిష్కళంక దేశ భక్తుడు .
గాంధీజీ సత్యా గ్రహోద్యమానికి బందరు జాతీయ కళాశాల స్థాపనకూ విద్యార్ధినిగానే ఈమె ఇల్లిల్లూ తిరిగి విరాళాలు సేకరించింది .
ఉప్పు సత్యాగ్రహంలో పిడికిలిలో ఉప్పు పట్టుకొని ఉద్యమించే ఈమె చేతిని పట్టుకోలేక ఆంగ్లేయ అధికారి ఇండియన్ పోలీసుకు అప్పగిస్తే, అతడు ఈ మె గుప్పిట్లో ఉప్పు విడిపించలేక
చేతిని ఎంత బలంగానొక్కినా ఆమె చిరునవ్వుతో భరిస్తుంటే నిశ్చేష్టుడయ్యట .
సాండర్సు ఈమెకు ఆరునెలలుగ కఠిన కారాగార శిక్ష వేసారు . శిక్షతో పాటు జరీమానాకు కూడా గురైన తొలి ఆంధ్రమహిళ జానకీ బాయమ్మ .,రామస్వామి దంపతులు .
విశాఖ పట్టణం నుండి వెళ్ళి నెల్లూరు జిల్లా పినాకినీ సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నారు.
..భార్యాభర్తలిరువురూ శిక్షలకు వెరువక గొప్ప సత్యాగ్రహ ఉద్యమాలు నడిపి శిబిరాలు నిర్వహించారు .ప్రసంగాలతో వేలాది తెలుగు వరిని ఉత్తేజ పరిచారు ..
॥931 లో జానకీబాయమ్మ గాలికి. 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించి రాయవేలూరు జైలులో నిర్బందించారు .ఆ కారాగారం లోన ఈమెకు దుర్గాబాయి దేశముఖ్ ,ఆచంటరుక్మిణీ దేవి వంటి ప్రముఖ స్త్రీలతో పరిచయం ఏర్పడింది అదేజైలులో ‘దేవకీదేవి యోగ మాయకు జన్మనిచ్చినట్లు’ జానకీబాయి ఒక బాలికకు జన్మనిచ్చింది ..ఆజైలులో ప్రముఖ స్వాతంత్రయోధురాళ్ళంతా సహాయపడ్డారట. దుర్గాబాయ్ అక్కడ కలిసారట.రఘుమాయాదేవి ఈమెగారి పాపకు బాలసార చేసి నామకరణం చేస్తే ,కోటమర్తి కనకమ్మ స్నానంచేయించారట. భారతీ రంగా గాని కుట్టి తొడిగారట .రుక్మిణీ లక్కీపతి జోకొట్టి జోలలు పాడేవారట .ఏడునెలలు ఆ శిశువు. జైలులో పెరిగాక విడుదలయ్యారట . విడుదలయినప్పడు వీరిని మన మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి దంపతులుమద్రాసు తీసుకువచ్చి, అక్కడినుండి స్వయంగా. విశాఖ పట్టణం తీసుకు వెళ్ళారట. స్వాతంత్ర్యఅనంతరం కూడాభారతీయ స్త్రీ సమాజ స్థాపనకు విశేష కృషి చేసిన వీరు చిరస్మరణీయులు .
రైతు ఉద్యమ మహిళానేత భారతీరంగా. స్వాతంత్రోద్యమవీరుడైన తండ్రి .తండ్రి ఆశయాలతో పెరిగిన భారతీ దేవి దేశాభ్యుదయాన్ని కాంక్షించడంలో ఆశ్చర్యంలేదు .
కొన్నాళ్ళు మాతృదేశంలో విద్యాభ్యాసంచేసి, భర్తతోపాటు లండన్ వెళ్ళి నప్పుడు అక్కడ విద్యాభ్యాసం చేసి వచ్చారు .1930 లో సత్యాగ్రహోద్యమంలోనూ ,విదేశీ వస్తు బహిష్కరణ పన్నులనిరాకరణ వంటి అనేక ఉద్యమాలలో ఎంతో కృషిచేసారు .ఆమెతన సేవాభావంతో త్యాగనిరతితో గాంథీగారిని మెప్పించారు గాంధీజీ వెంకటగిర జమిందార రైతులసమస్యలపరిష్కారానికి వెళ్ళిప ఇపుడు భారతీదేవిని .పొనకా కనకమ్మగారినీ కలసారట .
వారిద్దరితో గాంధీజీ ఆంధ్రా మహిళలకు ఉత్సాహమేకాదు కార్యశూరత్వం కూడా ఉంది
అని మెచ్చుకున్నారట .ఈమె గొప్ప దేశభక్తురాలు
దేశాభ్యుదయం కోసం వివిధ కార్య క్రమాల నిర్వహణలోనూ, కార్యదక్షతాదీక్షలోను ,త్యాగనిరతిలోనూ, ధైర్య సాహసాలు ప్రదర్శించడంలోనూ ,స్త్రీ చైతన్య శక్తికి శుద్ద ప్రతీక యైన దుర్గాబాయి దేశముఖ్ మార్గ దర్ర్శియని చెప్పక తప్పదు .
చిన్నప్పటినుండీ ఆటపాటలలో చదువుసంధ్యలతో చురుకుగాఉండేది .తాత, తండ్రి తల్లివలన స్వాతంత్రోద్యమంపట్ల అవగహన పెంపొందించుకున్నది.
వీరేశలింగంగారి స్తీజనోధ్ధరణ ఈమెకు ఆదర్శం .
పదకుండేళ్ళవయసులోనే ఆమె కాకినాడలో బాలికా హిందీ పాఠశాల ప్రారంభించింది.
అన్ని కళలలో పట్టు సాధించింది. కాంగ్రెసు మహాసభలకు 600 మంది మహిళా వాలంటీర్లకు తర్ఫీదు చేసింది దుర్గాబాయి తను నడుపుతున్న పాఠశాలనుండేనట.
కాంగ్రెసు మహాసభలప్రవేశద్వారంవద్ద టిక్కెట్. లేదని ఆయననెహ్రూగారని చెప్పినా
అం దరికీ ఒకటే నిబంధన అవి టిక్కెట్ ఇచ్చే వరకూ నెహ్రూ గారిని కూడా లోప లిపి పోనీయలేదట వారి మెప్పును పొందిన ధైర్యశాలిని ..
గాంధీజీ కాకినాడ. పర్యటనలో మహిళలతో ప్రత్యేక సమావేశమ నేర్పాటుచేసి నాటి కాంగ్రెస్ పెద్దల ఇష్టానిక వ్యతిరేకంగా గాంధీజీ ఆ సభలో ప్రసంగించేటట్లు చేసింది .
ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనడానికి గాంధీగార నుండి ప్రత్యేక అనుమతి పొందినది.
ఉద్యమాలలో పాల్గొని అనేక మార్లు జైలుక వెళ్ళికఠిన కారాగార శిక్షలకు గురైన దుర్గాబాయి
ఆ కారాగారంలో మహిళలన సంఘటితపరచి ఉద్యమానికి ఊపుతెచ్చినది .
అనునిత్యం ప్రజాహిత కార్య క్రమాలలో ఉద్యమాలలో నిమగ్నమై ఉండే దుర్గాబాయి నిత్య చైతన్యశాలిని .1955 లో దుర్గాబాయి హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.
మంచి కుమార్తెగా, మనుమరాలిగా, చురుకైన విద్యార్థినిగా నిబద్దత గల కార్యకర్తగా నాయకురాలిగా ,ఉపాధ్యాయగా ,గృహిణిగా ,న్యాయవాదినిగా , రచయిత్రిగా .సంఘ సంస్కర్తగా అనేక రూపాలతో తిరిగి ఆదిశక్తిగా మెలగిన దుర్గాబాయి సేవలు తెలుగు జాతి ఎన్నటికీ విస్మరించదు .ఈమె చిరస్మరణీయురాలు .
‘బఅగాధమగు జలనిధిలోన ఆణి ముత్యాలున్నట్లే’ .స్వాతంత్రోద్యమ సమరానికి వెవ్నుదన్నుగావిలచిన విశిష్ట మహిళలెందరో అందరికీ వందనాలు .
వారందరూ ఈ తెలుగు నేలపై వెలుగులు విరజిమ్మారు .పేరు పేరునా అందరినీ పరిచయం చేయగలిగిన సమయంలో తప్పక చేద్దాం .అంతవరకూ భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి కృషిచేసిన. జ్వలించి చలించిన ప్రతి ఒక్కరిక అంజలి ఘటిద్దాం .
భారతాంబిక పునర్వైభవ ప్రాప్తికొరకు నడుంకట్టిన మహిళామణులులో మనతెలుగు తేజాలెందరో మరెందరో అందరికీ వందనాలు .
…….భారత్ మాతాకీ జై ……...
దామరాజు విశాలాక్షి.900902794
